![]() |
![]() |
.webp)
రీతూ చౌదరి.. ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బుల్లితెరపై షోలు, సీరియల్స్, ఈవెంట్స్ లో కనిపిస్తూ ఫుల్ ఫేమస్ అయ్యింది ఈ ముద్దుగుమ్మ. ఇక కుర్రాళ్లకైతే ఈవిడ సోషల్ మీడియా పోస్టులు నిద్రలేకుండా చేస్తుంటాయి. ఎప్పటికప్పుడు హాట్ హాట్ అందాలతో ఇన్‌స్టాగ్రామ్‌ను షేక్ చేస్తుంది రీతూ చౌదరి.
తాజాగా ఆమె పెట్టిన ఓ పోస్ట్, అందులో ఆమె చేసిన పని చూస్తే వావ్ అనకుండా ఉండరు. టోటల్ గా బ్లాక్ శారీ, నల్ల కళ్ళజోడు, బ్లాక్ బ్యాంగిల్స్, బ్లాక్ టాటూతో ఎగురుతూ దూకుతూ స్టెప్పులేసుకుంటూ జింక పిల్లలా చిందులేస్తూ ఒక రీల్ చేసింది. ఏదైనా డాన్స్ చేస్తుందో లేదా అటు ఇటు తిరుగుతూ రీల్ కంప్లీట్ చేస్తుందేమో అనుకుంటే ఫైనల్ గా ట్విస్ట్ ఇచ్చింది. కొబ్బరి బోండాన్ని కత్తితో కొట్టుకుని మరీ తాగేసింది. ఈ రీల్ చూసాక నెటిజన్స్ ఐతే "క్యూట్, సూపర్ , చీరలో ముద్దుగా ఉన్నారు, మేడం సర్ మేడం అంతే, చూపు తిప్పుకోలేకపోతున్నాం, నేచురల్ బ్యూటీ" అంటూ కామెంట్స్ ఇస్తున్నారు. రీతూ చౌదరి ఇటీవలే కొన్ని వివాదాల్లో చిక్కుకుని సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ఈ వివాదాలను, గొడవలను పట్టించుకోకుండా రీతూ తనకు నచ్చినట్టు రీల్స్ చేసుకుంటూ పోతావుంది.
![]() |
![]() |